OUR RGUKT STUDENTS

310439_279715138795142_44835241_n

ENDUKU

 

                       దేశమును ప్రేమించుమన్నా

 

దేశమును ప్రేమించుమన్నా

మంచి అన్నది పెంచుమన్నా

వట్టి మాటలు కట్టిపెట్టోయ్

గట్టి మేల్ తలపెట్టవోయ్ !

 

పాడిపంటలుపొంగి పొర్లే

దారిలో నువు పాటు పడవోయ్

తిండి కలిగితె కండ కలదోయ్

కండ కలవాడేను మనిషోయ్ !

 

ఈసురోమని మనుషులుంటే

దేశ మేగతి బాగుపడునోయ్

జల్డుకొని కళలెల్ల నేర్చుకు

దేశి సరుకులు నించవోయ్ !

 

అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్

దేశి సరుకులు నమ్మవెలె నోయ్

డబ్బు తేలేనట్టి నరులకు

కీర్తి సంపద లబ్బవోయ్ !

 

వెనుక చూసిన కార్యమేమోయ్

మంచిగతమున కొంచమేనోయ్

మందగించక ముందు అడుగేయ్

వెనుక పడితే వెనుకేనోయ్ !

 

పూను స్పర్దను విద్యలందే

వైరములు వాణిజ్య మందే

వ్యర్ధ కలహం పెంచబోకోయ్

కత్తి వైరం కాల్చవోయ్ !

 

దేశాభిమానము నాకు కద్దని

వట్టి గొప్పలు చెప్పకోకోయ్

పూని యేదైనాను, వొక మేల్

కూర్చి జనులకు చూపవోయ్ !

 

ఓర్వలేమి పిశాచి దేశం

మూలుగులు పీల్చేసె నోయ్

ఒరుల మేలుకు సంతసిస్తూ

ఐకమత్యం నేర్చవోయ్ !

 

పరుల కలిమికి పొర్లి యేడ్చే

పాపి కెక్కడ సుఖం కద్దోయ్

ఒకరి మేల్ తన మేలనెంచే

నేర్పరికి మేల్ కొల్ల లోయి !

 

సొంత లాభం కొంత మానుకు

పొరుగువాడికి తోడు పడవోయ్

దేశమంటే మట్టికాదోయి

దేశమంటే మనుషులోయ్ !

 

చెట్ట పట్టాల్ పట్టుకుని

దేశస్తు లంతా నడవవలె నోయ్

అన్నదమ్ముల వలెను జాతులు

మతములన్నీ మెలగవలె నోయి !

 

మతం వేరైతేను యేమోయి

మనసు వొకటై మనుషులుంటే

జాతియన్నది లేచి పెరిగీ

లోకమున రాణించు నోయి !

 

దేశ మనియెడి దొడ్డ వృక్షం

ప్రేమలను పూలెత్తవలె నోయ్

నరుల చెమటను తడిసి మూలం

ధనం పంటలు పండవలె నోయి !

 

ఆకులందున అణగి మణగీ

కవిత పలకవలె నోయ్

పలుకులను విని దేశమందభి

మానములు మొలకెత్త వలెనోయి !

 

రచన: గురజాడ అప్పారావు

 

అనువాదం యొక్క ప్రయోజనాలు :
అనువాదం వల్ల ఒక భాష లోని సంస్కృతీ, సాంప్రదాయాలు వెరే భాష లోని వ్యక్తులకు తెలుసుకోవడానికి వీలు కలుగుతు్ది. నేడు మనం ఇన్ని సంస్కృతుల గురించి తెలుసుకున్నాము అంటే కారణం రామాయణం , మహభారతం మరియు భగవతం వంటి గ్రంధాల మహిమ. కాని అవి మన తెలుగు భాషలో స్వయంగా రచించబడినవి కాదు. అవి అనువాద గ్రంధాలు.ఇంకా యెన్నో పురాణాలు, ఇతిహాసాలు , కతలు ,వేదాలు మరియు నాటకాలు వంటి యెన్నొ గ్రంధాలు అనువాధం అయ్యాయి . ఈ యొక్క ఉదాహరణ చాలు వాటియొక్క ఉపయోగం ఎంటో తెలపడానికి. ఇంకా అనువాదం వల్ల మనం ఇతర సంస్కృతిలోని ఆచార వ్యవహారలు మనకు తెలుస్తాయి.మన సంప్రదాయం ఇతరులకు తెలుస్తుంది. మనకు స్వయంగా అందుబాటులో లేని ఎన్నొ విశయాలు అనువాధ గ్రంధాల ద్వార తెలుస్తాయి. అనువాదం చేయడం ద్వార ఆ భాష గురించి కూడా తెలుస్తుంది. మన దేశంలోని ఎన్నొ ప్రయోగ గ్రంధాలు ఇతర దేశం యెక్క భాశాలలోనికి అనువాదం అయ్యి ఎంతో ఉపయోగపడ్డాయి.

For the New story  Navami click link NAVAMI

జీవ వైవిధ్యపు ఈ పుడమి పైకి,
జ్ఞానాజ్ఞాన మనుష్యుల మధ్యకి,
అనంతమైన ఈ అనుబంధాల లోగిలిలోకి,
నన్ను రానిచ్చిన ఓ తల్లీ! నీకు నా వందనం.
“జన్మనిచ్చిన నీకు జన్మంతా ఋణపడి ఉంటానమ్మా!”
అప్పుడే వచ్చిన ఓ నూతన జీవికి,
అడుగులునేర్పి,
తడబాటు మాన్పి,
నాకు మార్గదర్శకమైన నా తండ్రీ నీకు నా నమస్సులు.
” జీవితమంటే ఏమిటో నేర్పిన నీకు నా జీవితాన్ని దాసోహమంటా నాన్నా! ”
మీరు పక్కనుంటే కొండంత అభయం. ….మీరే నా ముత్య ద్వయం.

ఎన్నో పుస్తకాలు, మరెన్నో గ్రంథాలు.విశ్వ వ్యాప్తమైన మన తెలుగు సాహిత్యంలో ఆణిముత్యాల్లాంటి రచనలను ఏరి పాఠకులకోసం అందిస్తున్న Greaterteugu.com కి ఇవే నా ధన్యవాదాభినందనలు.

                                                                               నిశ్శబ్దం
కొండ మీద నిల్చొని ఉన్నాడు రాంబాబు.పల్లె చాలా అందంగా కనబడుతోంది.అయితే పల్లెకు చెరో రెండు వైపులా అదేదో స్తంభంలా రెండు కట్టడాలు కనిపించాయి.అవి ఏమిటో ఎంత ఆలోచించినా అంతుచిక్కలేదు.ఇంతలో తన పాతికేళ్ల కొడుకు సూటూ బూటూ వేసుకొని దర్జాగా తన దగ్గరకి వచ్చాడు .” అరే గోపీ! ఆ స్తంభాలేవిట్రా అలా ఉన్నయ్? అసలెందుకవి? ” అడిగాడు కొడుకుని. “ఓ.. అదా! సెల్ టవర్లు నాన్నా.మీ కాలంలో అయితే మాలాగా ఫోన్లు లేవుగా….!బావిలో కప్పలాగ నిశ్శబ్దంగా వుండేవారు. కానీ ఇప్పుడు కాలం మాది.చూశావా? ఆ ఒక్క టవర్ చాలు.అమెరికాలో ఉన్నవాడినీ అమలాపురంలో ఉన్నవాడినీ కలపడానికి.అదంతా మా సైన్సు సాధించిన గొప్పే నాన్నా” అన్నాడు గోపి. కొడుకు మాటలు ఎబ్బెట్టుగా ఉన్నా ” నిజమేరోయ్” అని వూరకుండిపోయాడు రాంబాబు.
ఏళ్ళు గడిచాయి.సరిగ్గా పది సంవత్సరాలకి అదే కొండపైన గోపి ఉన్నాడు.
ఇప్పుడు పల్లె ముందున్నంత అందంగా లేదు.టవర్లు మాత్రం పెరిగాయి.దాంతో పాటు చెవుడు,చర్మ వ్యాధులూ కూడా ప్రతి ఒక్కరికీ ఉచితంగా అలవాటైంది.గోపీకి కూడా.ఇప్పుడు పల్లె నిశ్శబ్దంగా వుంది.టవర్ల మధ్యలో రాంబాబు సమాధి స్పష్టంగా కనిపిస్తోంది.ఇప్పుడు గోపికి పది సంవత్సరాలక్రితం మాటలు గుర్తొచ్చాయి.విని నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు.అయితే ఆ నవ్వులో జీవంలేదు.