విషాదం నిద్రిస్తున్నప్పుడు
అక్షరాలు మేల్కొంటాయి
పదాలలో ఒదిగిపోయి
వాక్యలు ఒకదాని వెనుక మరొకటి పరుగులు పెడతాయి
ఈ భావాల వెల్లువను కవిత్వమనోచ్చా?
ఏమో…నాకైతే తెలిదు!
I call it as flow of emotions

సంతోషం ఉరకలేస్తున్నప్పుడు
ఎగిరెగిరిపడే మనుసును
కూసిన్ని అక్షరాలతో అభిషేకిస్తాను
కొండంత తృప్తి పధిల పరుచుకోవటానికి.
అలా..అల్లిబిల్లిగా అల్లేసిన పదాలను కవిత్వమనోచ్చా?
ఏమో…నాకైతే తెలిదు!
I call it as flow of expressions

నా అనుభవాలు

నేను చూసిన సంఘటనలు

నా ఆలోచనలు

నేను గమనించిన విషయాలు

అది ఇది అని కాదు

తోచింది రాసేస్తాను.

రాసిందంతా కవిత్వమనోచ్చా?

I don’t dare to say…I call it as flow of thoughts

కలం నా నేస్తం

ఎందుకంటే…నిజాయితీ సిరా కాబట్టి

కలం నా విమర్శ

ఎందుకంటే…అంతరాత్మ ఊపిరి కాబట్టి

కలం నా ప్రోత్సహం

ఎందుకంటే……?

చివరి అక్షరం లిఖించక, వెనుతిరిగి చూసుకుంటే “ఇదంతా నేనే!” అనే సంబరం!

ఓ మెప్పు సంతోషాన్నిస్తుంది

ఓ విమర్శ ఆలోచనను రేకెత్తిస్తుంది

అలాగని…

మెప్పులకు బానిసను కాదు

విమర్శలకు భయపడీపోను

నచ్చితే హత్తుకుంటా

నచ్చకపోతే పక్కకుపోతా

ముసుగేస్తే అక్షరాలు తిరగబడతాయి….

బాషపై పట్టు లేదు

పదాలు తడుముకుంటాను!

భావం నా సొత్తు

వ్యక్తీకరణ నా హక్కు!

భావుకత్వం నేర్చుకుంటే వచ్చేదా?

కేవలం ఆస్వాదించాల్సిందే!

………Flow of thoughts.

This entry was posted on Thursday, October 4th, 2012 at 4:15 pm and is filed under Uncategorized. You can follow any responses to this entry through the RSS 2.0 feed. Both comments and pings are currently closed.

Comments are closed at this time.