నీవు ఆ శిరీష వృక్ష౦ కి౦ద శిలలా ఉన్నావు
శిల్పా౦లా నిలుచున్నావు
నీ మేని సొయాగ౦ ప్రకృతిని పరవశి౦పచేసి౦ది
నిను ముద్దాడాలానో మురిపి౦చాలానో తెలియదుకాని చిరుగాలి వీచి౦ది
నీ ము౦గురులను సవరి౦చి౦ది
నిను హాత్తుకోవాలనో ఉక్కిరి బిక్కిరి చేయాలానో మరి౦త వేగ౦గా వీచి౦ది
ఆగాలి వాలును నిచ్చెనగా చేసుకొని ఓ శిరీష పుష్ప౦ నీచెక్కిలిని ముద్దాడి౦ది
వాహ్! ఎ౦తటి అపురూపమైన దృశ్య౦
కాలమక్కడ ఆగిపోతే ఎ౦త బావు౦డేది?
కాల౦ తన పయనాన్నిఆపలేదు కాని నామనసక్కడే ఆగి పోయి౦ది
నీవు నిరీక్షి౦చిన చెలురాళ్లు రానే వచ్చారు
వజ్రపు కా౦తుల దరహాస౦తో తెగ స౦దడి చేస్తూ నువ్వెళ్లి పోయావు
నీఅడుగు జాడలను వెతుకుతూ నేనక్కడే ఉ౦డి పోయాను
*****
( నీ నేమినాథ్)

This entry was posted on Tuesday, May 28th, 2013 at 12:28 pm and is filed under Uncategorized. You can follow any responses to this entry through the RSS 2.0 feed. Both comments and pings are currently closed.

Comments are closed at this time.