Archive for March, 2011

సమయం


గడిచిన క్షణం తిరిగి రాదు   నేటి  క్షణం ఏమవునో తెలీదు
అనుక్షణం ఆలోచనలతో  ఈక్షణం వృదా కానీకు
ఏమి రావు అనుకోకు అనుకుంటే  అన్ని సాధ్యమే నీకు
లక్ష్యానికి గురిపెట్టు   వచ్చే అవాంతరాలను కనిపెట్టు
అందమైన జీవితం ఉహించు  అందుకోవాలని పరితపించు.
అనుకున్నది సాదించు  అందరికి ఆదర్శంగా జీవించు

సహనం

విజయం కంటే సహనం గొప్పది
సహనం ఉంటె సాధ్యం కానిది లేదు
విజయ లక్ష్యం కోసం జరిగే సహన సమరం లో సుశీలుడవై   సహనం అనే కవచాన్ని ధరించాలి
సహనశీలుడవై   వచ్చే ఆటంకాలను అనుభవం చేసుకోవాలి
సాహసవంతుడవై  వాటిని ఎదుర్కోవాలి
కలిసొచ్చే  కాలమే విజయం తెచ్చిపెడుతుంది
ఎన్నో అవరోధాలు దాటిన తర్వాత వచ్చిన విజయమే అమితానందం కలిగిస్తుంది


అన్వేషణ


ఆకాశంలో మేఘం ఆవేదనతో నా హృదయం
అన్వేషించే నీ కోసం అనుక్షణం నీ కోసం,
కన్నుల నీరు నువ్వేనా కనిపించని నా చిరునవ్వేనా
ఎంతకాలం దాచగలని బాధ  నా మదిలోన,
కదిలే మేఘం చూపెనా , ఎగసే అలలే తేలిపెనా
వీచే గాలి చూపెనా, పూచే పువ్వులు తెలిపెనా

నీ  చిరునవ్వుల చిరునామా,
ప్రేమకు ప్రాణం పోశావు ప్రాణం నీవై  నిలిచావు
గుండెలోని వేదనంత నీకు విన్నవించే క్షణం కోసమే నా నిరీక్షణ,
ఎందరి మధ్యన  నేనున్నా, ఎదురుగ నీవున్నావన్న భావనతోనే  బ్రతికున్నా
ఆది అంతం మనమేగా అంతరిక్షం వరకైనా,
అలుపెచెందక  నా మనసే ఆగక నిను వెతికేనా….!

ఉన్నవాడు –లేనివాడు

బడా బాబుల ఆగడాలు ఆగేనా? ——– బీదవాని బాధలు తీరేనా ?
వాడ వాడ తిరుగుతాడు ఓటు కోసం పరిగెడతాడు ఆశలు కల్పించడంలో ఆలయ శిఖరాలు అదిరోహిస్తాడు—-బీదవాని గోడు వినిపించికోడు
మేడల్లో ఉంటాడు పదవుల మోజుల్లో ఉంటాడు—-గుడిసెల్లో ఉంటాడు గుక్కెడు గంజికై ఎదురుచూస్తుంటాడు.
ac కార్లల్లో తిరుగుతాడు సోషల్ సర్వీసు అంటే పడదంటాడు—-కాలిబాటలో వెళుతుంటాడు, కాయకష్టం చేస్తుంటాడు.
పనిచేయకున్న పంచపక్ష ఫలహరాలే తింటాడు—-పనిచేస్తేనే ఫలితమని ఒక పూటైన భోజనమని అంటాడు
నిర్లక్ష్యంగ ఉంటాడు నీలాకాశం లో తేలుతుంటాడు—- నేలపై ఉంటాడు నిజాయితీనే నమ్ముకుంటాడు.

సౌందర్యమా


పువ్వుల్ల్ని చూశాను నవ్వుల్ల్ని చూశాను
పువ్వులా నవ్వే నిన్ను చూస్తున్నాను,
జాబిల్లిని చుశాను జాజిమల్లి చూశాను
జానేడంత  నడుమున్న  నిన్ను చూస్తున్నాను,
అందాన్ని చుశాను, ఆనందాన్ని చుశాను
అందనంత ఎత్హు  ఉన్న నిన్ను చూస్తున్నాను,
ఎగసే అలలను చూశాను, ఎగిరే పక్షిని చూశాను
ఎదురేలేని దైర్యం నీలో చూస్తున్నాను
కోయిల పాట విన్నాను, మయూరి నాట్యం చూశాను
మైమరపించే చక్కని చుక్కనే చూస్తున్నాను.
నీ మాటలే పాటగా చేసావు, నాలో ఆశలు రేపావు
అంతే లేని ఆలోచనలకు అక్షరాలే నేర్పించావు
కవ్వించే నువ్వు కనిపించావు
కలిసొచ్చే  కాలాన్ని  నా ముందున్చావు
ఊహకు  అందని ఆనందం ఊసులాదుకున్దమ్
ఉప్పెనలా వచావు ఊపిరిలా  నిలిచావు
ఓ నా సౌందర్యమా. …………………………!!

వెలుగు


సిరిమల్లెపువ్వు సిరిమల్లెపువ్వు
చిన్నరిపాపల నవ్వే నువ్వు,
కంటిలోని కలతలన్నీ కాలానికి వదిలెయ్యాలని
గుండెలోని బాధనంత గువ్వల ఎగిరిపోవాలని,
చల్లని జల్లుల చిరునవ్వే నీ  పెదవుల పై  ఉండాలని
అవధులు లేని ఆనందం నీ సొంతం కావాలని,
చీకటిలో వెలుగే నీకు చూపాలని
చిన్ననాటి స్నేహాన్ని అనుబందం చేయాలనీ
వస్తున్న చెలియా నీ కై  వస్తున్న………..