చిట్టి బుజ్జాయిలకు నువ్వంటే ఇష్టం నీ వెనకే వేసవి సెలవులొస్తాయని!
రైతన్నలకు నీ రాక ఇష్టం పంటకనువు కాలం తీసుకొస్తావని!
కోయిలమ్మలకు నువ్వంటే ఇష్టం లేత మావి చిగుళ్ళు మోసుకొస్తావని!
కవులందరికీ నీ రాక ఇష్టం నీ పైన కవితలు అల్లుకోవచ్చునని!
ఓ నందన నామ సంవత్సరమా! వస్తున్నావా మా కోసం …. తెస్తున్నావా సిరి సంతోషం !
By: Sudha kalyani Achanta