Archive for September, 2012

రైతులు కారు, నాటుతుంటారు విజ్ఞానపు విత్తనాలు ఏడాది పొడుగునా!
రాజకీయ వాదులు కారు, ప్రభావితం చేస్తుంటారు రేపటి పౌరుల్ని!
సెలెబ్రిటీలు అసలే కారు, గుర్తుంటారు కొన్ని వందల మందికి!
గుర్తున్నారా ఆ బెత్తాలగురువులు మన బతుకు పునాది రాళ్ళేసిన మేస్త్రీలు

కార్పొరేట్ కల్చర్ వచ్చి పొదుపు చేసింది తెలుగు మాటల్ని!
వెస్ట్ సైడ్ గాలి వీచి పొదుపు చేసింది బట్టల సైజులని!
మెట్రోసిటీ లొచ్చి పొదుపు చేస్తున్నాయి ఇళ్ళ సైజులని!
ఏ కల్చర్ వచ్చినా ఏ గాలి వీచినా పొదుపు చేయవద్దు నీలోని మనిషిని మనీషిని!

Tags: ,