Archive for February, 2013

నిండు జాబిలీ పక్కన తారలా….
నీ పక్కన నేనిలా….
ఉండిపోతాను తోడులా…
నది వెంట నావలా…
నీ వెంట నేనిలా…
నడిచి వస్తాను నీడలా….
ఎండ తాకిన మంచులా…
కరిగిపోయాను నేనిలా….
ఇదంతా నా కలా…
నేలను తాకుతున్న చినుకులా….
చేరువవుతాను నీకిలా….
మిగిలిపోతాను ప్రేమలా…
నీ సాయి

కుంభమేళ !!!
ఈ ఇంటెర్నెట్ శకంలో భగవంతుడికి భక్తుడిని వెంటనే అనుసంధానం చేసే సత్వర మార్గం.
గుడిని, గుడిలో అమ్మవారిని మింగితే ఏమండి? తిరుమలవారికి కొత్త కిరీటం తెచ్చిస్తే సరిపొలా..  కార్తీక పురాణం చదివేసి, ఎన్ని పాపాలు చేసినా ఫర్లేదు చివరిలో నారాయణ – నారాయణ అంటే, అన్ని హరించుకు పోతాయని, మన గట్టి నమ్మకం కదా..
కోటానుకోట్లమందికి, తమ పాపాలు, తమ వాళ్ళ పాపాల మీద ఎంత శ్రద్ధనో? ఒక్కొక కుటుంబమూ, ఇరవై వేలనుండి సగటున అరవై వేలదాక ఖర్చుపెట్టేసి, తమ పాపాలనుండి తప్పించేసుకోను తాపత్రయం. ఇదంతా ఒక్క రోజు బ్రతికేందుకు అల్లాడే పసికందుల కోసం వెచ్చిస్తే, ఎంత మంది చిన్నారులు తమ చిరునవ్వుతో దీవించరు?
పాప పుణ్యాలతో నీకేమి మమకారం పార్ధ!!  అధర్మానికి పట్టం కడితే, తండ్రయినా, తాతయినా, అన్నయినా, తమ్ముడైనా, ఎదిరించి పోరడమన్న శ్రీ కృష్ణ గీత మనకెందుకు? జై రామ అన్న నొటితోనే, అన్యాయం, అవినీతి చేసే వాళ్ళకు జై కొట్టేస్తాము. ఒకప్పుడు రాక్షసుడంటే లంకాపతి రావణుడే రాముడొక్కడు సరిపోను, కాని ఇప్పుడు, ఒక్క వూరికి ఎందరో? మరి అంత మంది రాముళ్ళు రారే?
ఉత్కృష్టమైన వైకుంఠ గంగను పాతాళానికి దింపిన భగీరధుని వారసులము కాదండి. శత కోటి పాపాలను, ఒక్క మునకతో సరి చేసుకును సగరులము ఇంకా.
ఇంత మంది పాపాలను కడగలేక సతమతమయ్యే గంగమ్మకు సానుభూతి తెలుపుతూ….
–క్షణాక్షరాలు

ఆంగ్ల పలుకుల ప్రాసలే,

ఈ సర్వ జగతిని యేలుతుంటే,

కలత చెందిన తెలుగు భారతి, కంటి నీరే వరదలై,

సెలయేరులై, తెలుగు జాతిని కడుగుతుంది,

ఆ జలములో పరిశుద్ది చెంది,

స్వచ్ఛమైన పచ్చిపాల వంటి,

ఆ తెలుగుభాష తీపి నెరిగి,

ఆ కమ్మనైన తెలుగుకు, తెలుగు భాషకు ఖ్యాతి తేరా!!!

ఓ స్వార్ధమెరుగని తెలుగు వీరా!!!