Archive for July, 2013

విప్లవాన్నే శ్వాసించే భీమతో
కవిత వ్రాయించుకుంటున్న ఓ ప్రేమ
నీకు విప్లవాభివందనలు……!
సమస్యలపై గళమెత్తే ఈ గొంతు
నిన్ను చుస్తే తడబడుతుంది..
దానికి నడక జతకడుతుంది
నువ్వు కనిపిస్తే… అదీ కదలనంటుంది

నువ్వు ఎదురైనా ప్రతిసారి
నాకు మౌనమే మిగిలే…..!

అప్పటికి ప్రయత్నించా ..,
వర్షపు చినుకునై.. నిను
తాకాలని..,
ఎదురుచుసే పోద్దునై
నీ రాకను వీక్షించాలని..,
మట్టినై…నీ పాదం
కింద నలగాలని…!
కానీ..,ప్రతి చోట అవమానమే
ప్రతిసారీ తిరస్కారమే…!
అందుకే..,
అక్షరమై నిను ఆశ్రయిస్తున్న..,
కవితనై నీ నోట్లో నానుతున్న ..,
ప్రతీగా నీ నుంచి ..నాకు..,
చెప్పు దెబ్బలో/ చెంప దెబ్బలో
అక్కరలేదు…, కనిపించినప్పుడు
చిన్న చిరునవ్వు చాలు……
దోసిట్లో దాసుకొని..దాన్ని చూస్తూ
జీవితాంతం బ్రతికేస్తా…..!
ఇట్లు
By : Harish babu

Tags: , ,

Nannaserwadinche vallu Telugu kavita by Dr.Kavuri srinivas

Jayamantram in Telugu
Jayamantram in Telugu

Tags: ,

నట్టేటిలో ఉన్నా !
నిట్ట నిలువునా మునిగి పోతున్నా !
ఆదుకునే దిక్కెవ్వడు !
చేయి అందిచు వాడెవ్వడు !
నిస్సత్తువతో కూడిన ప్రయాణం నాది !
నిస్తేజంతో కూడిన భావన నాది !
కన్న వారిని కళ్ళముందే పోగొట్టుకున్న అభాగ్యున్ని !
‘నా’ అన్నా వారికీ దూరమైన నిర్భాగ్యున్ని !
‘రానున్నది ఏ కాలం !
పోనున్నది ఏ కాలం ‘!
వీటితో నాకేమి పని ?
నిత్య దౌర్భాగ్య జీవనం నాది !

జననమన్నది ఒక ఘటన ,
బ్రతుకన్నది ఒక నటన ,
జీవితమన్నది ఒక సంఘటన !
మళ్ళీ మళ్ళీ రాని రోజు ఇది ,
మరపు రాని మరో ‘నేడు’ ఇది !
చరితన్నది చెరపడానికే ,
గతమన్నది గమనించడానికే !