Archive for April, 2014

OUR RGUKT STUDENTS

310439_279715138795142_44835241_n

ENDUKU

 

                       దేశమును ప్రేమించుమన్నా

 

దేశమును ప్రేమించుమన్నా

మంచి అన్నది పెంచుమన్నా

వట్టి మాటలు కట్టిపెట్టోయ్

గట్టి మేల్ తలపెట్టవోయ్ !

 

పాడిపంటలుపొంగి పొర్లే

దారిలో నువు పాటు పడవోయ్

తిండి కలిగితె కండ కలదోయ్

కండ కలవాడేను మనిషోయ్ !

 

ఈసురోమని మనుషులుంటే

దేశ మేగతి బాగుపడునోయ్

జల్డుకొని కళలెల్ల నేర్చుకు

దేశి సరుకులు నించవోయ్ !

 

అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్

దేశి సరుకులు నమ్మవెలె నోయ్

డబ్బు తేలేనట్టి నరులకు

కీర్తి సంపద లబ్బవోయ్ !

 

వెనుక చూసిన కార్యమేమోయ్

మంచిగతమున కొంచమేనోయ్

మందగించక ముందు అడుగేయ్

వెనుక పడితే వెనుకేనోయ్ !

 

పూను స్పర్దను విద్యలందే

వైరములు వాణిజ్య మందే

వ్యర్ధ కలహం పెంచబోకోయ్

కత్తి వైరం కాల్చవోయ్ !

 

దేశాభిమానము నాకు కద్దని

వట్టి గొప్పలు చెప్పకోకోయ్

పూని యేదైనాను, వొక మేల్

కూర్చి జనులకు చూపవోయ్ !

 

ఓర్వలేమి పిశాచి దేశం

మూలుగులు పీల్చేసె నోయ్

ఒరుల మేలుకు సంతసిస్తూ

ఐకమత్యం నేర్చవోయ్ !

 

పరుల కలిమికి పొర్లి యేడ్చే

పాపి కెక్కడ సుఖం కద్దోయ్

ఒకరి మేల్ తన మేలనెంచే

నేర్పరికి మేల్ కొల్ల లోయి !

 

సొంత లాభం కొంత మానుకు

పొరుగువాడికి తోడు పడవోయ్

దేశమంటే మట్టికాదోయి

దేశమంటే మనుషులోయ్ !

 

చెట్ట పట్టాల్ పట్టుకుని

దేశస్తు లంతా నడవవలె నోయ్

అన్నదమ్ముల వలెను జాతులు

మతములన్నీ మెలగవలె నోయి !

 

మతం వేరైతేను యేమోయి

మనసు వొకటై మనుషులుంటే

జాతియన్నది లేచి పెరిగీ

లోకమున రాణించు నోయి !

 

దేశ మనియెడి దొడ్డ వృక్షం

ప్రేమలను పూలెత్తవలె నోయ్

నరుల చెమటను తడిసి మూలం

ధనం పంటలు పండవలె నోయి !

 

ఆకులందున అణగి మణగీ

కవిత పలకవలె నోయ్

పలుకులను విని దేశమందభి

మానములు మొలకెత్త వలెనోయి !

 

రచన: గురజాడ అప్పారావు

 

అనువాదం యొక్క ప్రయోజనాలు :
అనువాదం వల్ల ఒక భాష లోని సంస్కృతీ, సాంప్రదాయాలు వెరే భాష లోని వ్యక్తులకు తెలుసుకోవడానికి వీలు కలుగుతు్ది. నేడు మనం ఇన్ని సంస్కృతుల గురించి తెలుసుకున్నాము అంటే కారణం రామాయణం , మహభారతం మరియు భగవతం వంటి గ్రంధాల మహిమ. కాని అవి మన తెలుగు భాషలో స్వయంగా రచించబడినవి కాదు. అవి అనువాద గ్రంధాలు.ఇంకా యెన్నో పురాణాలు, ఇతిహాసాలు , కతలు ,వేదాలు మరియు నాటకాలు వంటి యెన్నొ గ్రంధాలు అనువాధం అయ్యాయి . ఈ యొక్క ఉదాహరణ చాలు వాటియొక్క ఉపయోగం ఎంటో తెలపడానికి. ఇంకా అనువాదం వల్ల మనం ఇతర సంస్కృతిలోని ఆచార వ్యవహారలు మనకు తెలుస్తాయి.మన సంప్రదాయం ఇతరులకు తెలుస్తుంది. మనకు స్వయంగా అందుబాటులో లేని ఎన్నొ విశయాలు అనువాధ గ్రంధాల ద్వార తెలుస్తాయి. అనువాదం చేయడం ద్వార ఆ భాష గురించి కూడా తెలుస్తుంది. మన దేశంలోని ఎన్నొ ప్రయోగ గ్రంధాలు ఇతర దేశం యెక్క భాశాలలోనికి అనువాదం అయ్యి ఎంతో ఉపయోగపడ్డాయి.