Posts Tagged '‘హైదరాబాద్’లో జరిగిన ప్రేలుడులలో భారతీయులు సహాయ పడ్డారని తెలిసినప్పుడు ఒక కవి పడిన ఆవేదన .'

రత్నాలు రాసులుగా పోసి అంగడిలో అమ్మిన దేశం !
దేశ భక్తుల రక్తంతో పవిత్రమైన దేశం !
గీతా,వేదాలకు కొలువైన దేశం !
రామాయణం ,మహాభారతాలకు నెలువైన దేశం !
నేడు ఉగ్రవాదం అనే మారణకాండతో ,
రావణ కాష్టంలా నిరంతరం దహిస్తుంది !
ఇందుకేనా,
అలుపెరుగక అల్లూరి తెల్ల వారితో పోరాడింది ?
ఇదా ,
బానిసత్వపు శృంఖలాల నుండి బోస్ కోరిన భావి భారతం ?
ఇదా ,
భగత్ సింగ్ బందుకు పట్టి సాధించిన నవ భారతం ?
ఇదా,
గాంధీజీ కలలుగన్న స్వరాజ్య ‘మహాభారతం’?
ఆనాడు పరదేశీయులు తనను బంధిని చేసిన మౌనం వహించింది !
ఈనాడు తన బిడ్డలే తనను గాయపరుస్తుంటే ,
రుదిరాశ్రువులతో విలపిస్తోంది ఈ భారత మాత!

Tags: